తెలంగాణ మాల మహానాడు
ఖమ్మం జిల్లా కమిటీ
తిరుమలాయపాలెం ఆగస్టు 5 (వై7న్యూస్ );
ఎస్సీ వర్గీకరణ తీర్పును పునర్ పరిశీలించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాన్ని ఉద్దేశించి
ఖమ్మం జిల్లా తెలంగాణ మాల మహానాడు సంఘానికి చెందిన గుంతెటి వీరభద్రం లింగాల రవికుమార్ ముడుసు జాకోబ్ గులగట్టు ఎల్లయ్య చిలకబత్తిని కనకయ్య దామల సత్యం ఆధ్వర్యంలో నిన్న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని క్రితంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన తీర్పును కాదని ఈరోజు రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీ ఏ బి సి డి ల వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది ఇట్టి తీర్పు రెండు నాలుకుల ధోరణిగా ఉందని అధికార వర్గానికి అండగా ఇచ్చిన తీర్పులుగా ఉంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి బంగం కలిగించే విధంగా ఈ తీర్పు ఉంది. ఆది కాలములో విడి విడిగా ఉన్న ఎస్సీ కులాలను చదువుకు, నీటికీ, బడికి అంటరానితనం పేరుతో ఊరికి బయట నివసించే ఈ జాతులను సమిష్టిగా ఉండేందుకు షెడ్యూల్ క్యాస్ట్ పేరుతో ఒక దగ్గరకు తీసుకువచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
అలాగే ఎస్టిలైన ఆదివాసులను పై విధముగానే నివసిస్తున్న వారిని ఆర్టికల్ 342 ప్రకారం సమిష్టిగా జీవించేటట్లు ఏర్పాటు జరిగింది
కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏబిసిడిలుగా వర్గీకరించే హక్కు ఒక పార్లమెంటుకు తప్ప సుప్రీం కోర్టుకు లేదని మనవి చేస్తు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది.
ఎలాంటి కులగనన జరగకుండా నేనే వర్గీకరణ చేస్తానని బాధ్యతారహితంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు తన మాట వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు కొరివి దయానంద్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కొట్టే సుధాకర్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు ఉపాధ్యక్షుడు గాదరి బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ ప్రచార కార్యదర్శి జమ్మి వీరబాబు ఎర్ర గంగాధర్ ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పేర మల్లయ్య ఉపాధ్యక్షుడు తలారి రాధాకృష్ణ కరాటే వేణు చిరంజీవి బిందె రమేష్ బండ్ల నిర్మల జ్యోతి నగర అధ్యక్షుడు తురక నాగేశ్వరరావు దారా సంజీవరావు బి అరుణ చింతల రవి నీరుడు రాంబాబు కల్లూరు శ్రీనివాస్ ఊళ్లోజు ఉదయ్ మీడియా ప్రతినిధులు గుర్రం మనోజ్ పాగా యోనాల తో పాటు జిల్లా కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు









