గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్
యనభై లక్షల రూపాయల గంజాయి మూడు వాహనాలు సీజ్
పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ప్రెస్ మీట్
బూర్గంపాడు,ఆగస్టు02(వై 7 న్యూస్);భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణ సమీపంలో పుష్కర వనం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మూడు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి అయితే అది గమనించిన పోలీసులు వెంటనే ఆ వాహనాలను వెంబడించారు. పోలీసులను గమనించిన ఆరుగురు వ్యక్తులు వాహనాలు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించిన పోలీసులు పరారీలో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వాహనాలు తనిఖీలు చేయగా సుమారు రెండు వందల యాభై కేజీల గంజాయి వాహనాల్లో ఉన్నట్లు గుర్తించారు. సుమారు దాని విలువ యనబై వేల రూపాయల వరకు ఉంటుంది అని అంచనా వేశారు .వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఐదుగురు వ్యక్తులను మూడు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు అంటూ పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు గంజాయి తరలించేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్టు డి.ఎస్.పి వివరించారు గంజాయి రవాణా ప్రధాన సూత్రధారుడిగా శివ శంకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సీలేరు నుండి హైదరాబాద్ మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వారిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు..









