E-PAPER

పిల్లలకు తల్లి పాలు శ్రేయస్కరం;ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు

మణుగూరు, ఆగస్టు 02(వై 7 న్యూస్); మణుగూరు మండలం కూనవరం గ్రామ పంచాయతీ లోని అంగన్వాడీ 2 కేంద్రం లో తల్లి పాల వారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభం చేసిన తల్లి పాల వారోత్సవాలు భాగంగా కూనవరం లో శుక్రవారం నిర్వహించడం చాలా సంతోషం గా ఉందని, తల్లి కడుపులో నున్న శిశువు బలంగా ఉండాలంటే ముఖ్యంగా 7,8,9 వ నెలల్లో తల్లి మంచి ఆహరమైన ఆకుకూరలు, కూరగాయలు,పాలు, పండ్లు తీసుకుంటే నవజాత శిశువులు ఆరోగ్యం గా జన్మిస్తారని, పుట్టిన వెంటనే తల్లి శిశువు కు ముర్రు పాలు త్రాగించాలని అట్లా 6 నెలలు వరకు రోజుకు 12 సార్లు త్రాగించడం వలన శిశువు బలంగా ఉండటం కాకుండా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి శ్రేష్టం గా నవజాత శిశువులు ఉంటారని ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎం పి టి సి లు గుడిపూడి. కోటేశ్వరరావు, తాటి. సరిత అంగన్వాడీ టీచర్ వీరాకుమారి, ఆయా పాయం. శశిరేఖ, ఏ. యన్.ఎం..,హెచ్. లక్ష్మి, ఆశ వర్కర్ ఏనిక. నరుసులమ్మ, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News