భద్రాచలం, జూన్ 27: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
ఇటీవల 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. స్పాట్ కౌన్సిలింగ్ జూలై 2న ఉదయం 9 గంటలకు భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, అర్హులైన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొని సీట్లు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 9490957271, 9490957270 నంబర్లను సంప్రదించాలని సూచించారు.








