భద్రాచలం, జూన్ 27: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (TAPRPA) భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో సంఘం సీనియర్ సభ్యుడు ముగడ రాంబ్రహ్మచారి సతీమణి స్వర్గీయ శ్రీమతి ముగడ సావిత్రి ప్రధమ వర్ధంతి కార్యక్రమం శనివారం భద్రాచలంలోని గుప్తా కన్వెన్షన్ హాలులో నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు, సభ్యులు, సబ్ ట్రెజరీ అధికారి టి. సుభద్రతో పాటు సిబ్బంది పాల్గొని శ్రీమతి సావిత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో డివిజన్ గౌరవాధ్యక్షుడు చండ్ర సుబ్బయ్య చౌదరి, కోశాధికారి డి. కృష్ణమూర్తి, సహాధ్యక్షులు ముగడ హరినాథ్, సోంపాక రాజబాబు, కార్యదర్శి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎల్.వి. ప్రసాద్ నిర్వహించినట్లు తెలిపారు.








