కరకగూడెం, జూన్ 28 ((వై 7 న్యూస్ తెలుగు);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్‌పట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమరం సత్యనారాయణ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ నాగరత్నం, ఆరోగ్య కార్యకర్త పోలబోయిన సరిత, ఆశా వర్కర్లు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోలియో నిర్మూలన కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు.
–
రిపోర్టర్ ; దిలీప్
Post Views: 52








