ములుగు జిల్లా: పస్రా–తాడ్వాయి మధ్య అటవీశాఖ చెక్పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పస్రా వైపు వెళ్తున్న ఇసుక లారీ.. CRPF వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ CRPF జవాన్ మృతి చెందగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో పస్రా వైపు వెళ్తున్న మరో కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదం తీవ్రతకు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాదానికి అసలు కారణం, డ్రైవర్ పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
మృతిచెందిన జవాన్ వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనకు సంబంధించిన విజువల్స్ Y7 News Teluguకు అందాయి.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.









