E-PAPER

పీఎం కిసాన్ నగదు జమ కోసం ప్రతి రైతు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి

పంట నమోదు ఈ నెల 10 తో గడువు ముగుస్తుంది

ఫార్మర్ ఐడి రైతు విశిష్ట సంఖ్య నమోదు తప్పనిసరి … ప్రతి రైతు రిజిస్టర్ అవ్వాలి


చింతూరు, వై7 న్యూస్ అక్టోబర్ 08: చింతూరు మండలంలో ఉన్న ఇంకా కొంత మంది రైతులు ఈ కేవైసీ పక్రియ ఇంకా పూర్తి చేసుకొని వారు వివరాలు రైతులు స్వయంగా ధృవీకరించుకోవచ్చు.స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులందరూ తమ వివరాలు చెక్ చేసుకుని సరి అయినవైతే యాక్సెప్ట్ బటన్ నొక్కి ధృవీకరణ చేయాలి.. ఒకవేళ తప్పు వివరాలు నమోదు అయితే రిజెక్ట్ చేసి సరి అయిన వివరాలు నమోదు చేయాలి
తదుపరి వివరాలకు తమ వ్యవసాయ సిబ్బంది ని సంప్రదించవలసిందిగా సూచన
ఈకేవైసీ చివరి తేదీ 15.10. 2026
పంటల బీమా చేయించుకున్న రైతులందరూ తప్పనిసరిగా తమ వివరాలని వ్యవసాయ సిబ్బంది ద్వారా నమోదు చేయించుకోవాలి తదుపరి ఈ ఈకేవైసీ చేయించుకోవాలి.
అన్ని ప్రభుత్వ పథకాలకు రైతు విశిష్ట సంఖ్య ఫార్మర్ ఐడి అనేది తప్పనిసరి . సొంత భూమి కలిగిన రైతులందరూ ఈ ఐడి కలిగి ఉండాలి.
పీఎం కిసాన్ అర్హులైన రైతులందరూ తమ వివరాలను ఆన్లైన్ లో సరిచూసుకుని ఈ కేవైసీ మీ సేవ కేంద్రం లో తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ కేవైసీ పూర్తి అయిన రైతులకు మాత్రమే తదుపరి ఇన్స్టాల్మెంట్ నగదు జమ జరుగుతుంది. తమ భూమి వివరాలు ఆధార్ నెంబర్ తో మీసేవ లో అప్డేట్ చేయించుకోగలరు అని రైతులకు పత్రిక ప్రకటన ద్వారా చింతూరు మండలం ఏవో రత్నా ప్రభ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!