E-PAPER

‘దేవుడిని చంపేయాలనిపిస్తోంది’..! ఆర్జీవీ పోస్ట్ వైరల్..

ప్రముఖ విలక్షణ నటుడు నానా పటేకర్ (75) ఈ తెల్లవారుజామున ఆకస్మికంగా కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో భారత చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. నానా పటేకర్ ‘నటనకు దేవుడని’ కొనియాడారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో వర్మ స్పందిస్తూ… “ఎవరూ శాశ్వతం కాదని నాకు తెలుసు. కానీ ఇంత దృఢమైన వ్యక్తికి ఇంత హఠాత్తుగా ఇలా జరుగుతుందని నమ్మలేకపోతున్నాను. ఆయనను విఫలం చేసిన గుండెపై నాకు ద్వేషం కలుగుతోంది. నటనకు దేవుడైన నానా పటేకర్‍ను చంపేసిన ఆ దేవుడిని చంపేయాలనిపిస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అబ్ తక్ ఛప్పన్’, ‘భూత్’, ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ వంటి చిత్రాల్లో నానా నటనను ఎప్పటికీ మర్చిపోలేనని వర్మ పేర్కొన్నారు.

గురువారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన నానా పటేకర్‍ను హుటాహుటిన మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 45 నిమిషాల పాటు వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!