E-PAPER

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత..! వైరల్ గా మారిన వీడియో ..

సినీనటి సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈమె తల్లి కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత(Samantha) గత ఏడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహం చేసుకున్నారు. నాగచైతన్య(Naga Chaitanya) నుంచి విడాకులు (Divorce)తీసుకున్న ఈమె రెండో వివాహం చేసుకున్న ఏడాదిలోపే అమ్మగా ప్రమోట్ అయ్యారు. ఇటీవల నవంబర్ 19వ తేదీ సమంత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి దేవ్ నిడిమోరు(Dev Nidimoru) అని నామకరణం చేశారు.

ఈ విధంగా సమంత తల్లి కావడంతో ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. సమంత డెలివరీ తర్వాత రాజ్ చిన్నమ్మ ప్రముఖ సింగర్ శోభా రాజు (Shoba Raju) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంతకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈమె బయటపెట్టారు. సమంత చాలా మంచి అమ్మాయి అని సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చాలా కట్టుబాట్లను అనుసరిస్తుందని తెలిపారు. సమంత చిన్నప్పటినుంచి ఎన్నో ఇబ్బందులను పడినట్లు తన అబ్బాయి రాజ్ తెలిపారని శోభా రాజు వెల్లడించారు. సమంత జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి . వాటిని అధిగమించి ఈ స్థాయికి వచ్చిందని శోభ రాజు తెలిపారు.

ఇక మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమయంలో నాగార్జున తనకు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు కానీ సమంత మాత్రం నాగార్జున ఆఫర్ రిజెక్ట్ చేసినట్టు ఈమె తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతమంది డబ్బుకు వ్యామోహం కాకుండా ఉంటారు చెప్పండి అంటూ శోభా రాజు సమంత విడాకుల సమయంలో భరణం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద వందల కోట్ల రూపాయలు ఇచ్చారని వార్తలు వచ్చాయి కానీ ఎక్కడ స్పష్టత మాత్రం లేదు.

ఆరోగ్యపరంగా ఇబ్బందులు..

తాజాగా చైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న సమయంలో నాగార్జున ఇచ్చిన ఆఫర్ గురించి శోభ రాజు బయట పెట్టడంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది. ఇది తెలిసిన సమంత అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత చివరికి డైరెక్టర్ రాజ్ ను పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమా తర్వాత తన ప్రేగ్నెన్సీ విషయాన్ని బయట పెడుతూ ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!