E-PAPER

అర్ధరాత్రి వరకు ఫోన్‌తోనే జాగారం..! యువతకు నిద్ర కరువు..!

మనిషి శరీరానికి ప్రకృతి ఇచ్చిన సహజమైన విశ్రాంతి. కానీ మారుతున్న జీవనశైలిలో ఇప్పుడు అదే నిద్రకు కరువవుతున్నారు చాలామంది. ముఖ్యంగా యువత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. అర్ధరాత్రి దాటినా మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా, గేమింగ్‌, ల్యాప్‌టాప్‌లతోనే కాలం గడుపుతున్నారు. చదువు, పరీక్షలు, అసైన్‌మెంట్లు, ప్లేస్‌మెంట్ల ఒత్తిడితో నిద్ర సమయాన్ని తగ్గించుకుంటున్నారు. కెరీర్‌ కోసం నిద్రను త్యాగం చేస్తున్నారు. కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అన్నట్లు.. ఏ విషయంలోనైనా అతిగా వ్యవహరిస్తే చివరకు నష్టమే ఎదురవుతుంది. నిద్రను తగ్గించడం వల్ల చదువులోనే కాదు. ఆరోగ్యంలోనూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. నిద్రలేమితో ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి దెబ్బతినడం, చిరాకు, ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో శారీరక ఆరోగ్యంపైనా నిద్రలేమి ప్రభావం చూపుతుంది. అంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న మాటను మరిచి.. విజయాల వెంట పరుగులు తీస్తూ ఆరోగ్యాన్నే నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు? భారత్‌లో నిద్రలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 100 అధ్యయనాలను విశ్లేషించిన ఒక మెటా-అనాలిసిస్‌ ప్రకారం. దేశంలో సుమారు 25.7 శాతం మందిలో నిద్రలేమి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణ జనాభాను మాత్రమే తీసుకుంటే ఈ రేటు సుమారు 15.1 శాతంగా ఉంది. అంటే ప్రతి వంద మందిలో దాదాపు 15 మందికి నిద్రలేమి సమస్య ఉండొచ్చన్నమాట. ఇక 2026లో వచ్చిన మరో పరిశోధనలో…

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!