పినపాక | సెప్టెంబర్ 16
గుండె సంబంధిత సమస్యతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నా.. రాజేశ్వరి ప్రాణాలు దక్కలేదు. పినపాక మండలం ఈ బయ్యారం గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి యానబోయిన రాజేశ్వరి (58) గుండెపోటుతో మృతి చెందారు.
పేద కుటుంబానికి చెందిన రాజేశ్వరికి కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. చికిత్స కోసం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు.
అయితే శస్త్రచికిత్స పూర్తయిన 15 రోజులకే రాజేశ్వరి గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
రాజేశ్వరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Post Views: 38









