18న ఇంటర్వ్యూలు – నెలకు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం
చింతూరు ( వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబరు 16: పోలవరం జిల్లా లో ఉన్న 12 మండల నుండి ఆసక్తి గల నిరుద్యోగ యువత, యువతీ నుండి డ్రోన్ టెక్నాలజీ రంగంలో డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమంకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎమ్. పెరుమాళ్లరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోలవరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడకు చెందిన ప్రముఖ డ్రోన్ సంస్థ డ్రాగో డ్రోన్స్ ద్వారా శిక్షణ అందించనున్నట్లు తెలియ చేశారు. కావున పోలవరం జిల్లాలోని ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కోరారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికేషన్‌తో పాటు డ్రాగో డ్రోన్స్ సంస్థ ద్వారానే ప్లేస్‌మెంట్ సహాయం కూడా కల్పించబడుతుంది. శిక్షణ అనంతరం ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించిన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.18,000/- నుండి రూ.22,000/- వరకు వేతనం పొందే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో డ్రోన్ టెక్నాలజీ శిక్షణ ద్వారా వ్యవసాయం, భూ సర్వేలు, మ్యాపింగ్, నిర్మాణ రంగం, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్లను నైపుణ్యంతో నిర్వహించే అవకాశాలు లభిస్తాయన్నారు . ఈ నైపుణ్యంతో యువతకు డ్రోన్ పైలట్‌గా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు భవిష్యత్తులో డ్రోన్ ఆధారిత సేవల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కూడా అన్వేషించవచ్చు అని తెలిపారు. అర్హతలు
ఇంటర్మీడియట్ / డిప్లొమా / డిగ్రీ / ఐటీఐ ఉత్తీర్ణులు
18 సంవత్సరాలు పైబడిన వారు టెక్నాలజీ మరియు డ్రోన్ ఆపరేషన్స్‌పై ఆసక్తి కలిగిన వారు 18-09-2026 (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ఇంటర్యూ నిర్వహించబడతాయి. ఈ క్రింది ఫోన్ నెంబర్ లకు సంప్రదించగలరు
శ్రీ ఆనంద్ బాబు 6304634447, 6281618037








