కరకగూడెం, సెప్టెంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని సమత్ బట్టుపల్లిలో వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించనున్న ప్రదేశాన్ని గ్రామ సర్పంచ్ కొమరం సత్యనారాయణ శుభ్రం చేయించారు. కార్యక్రమానికి అనుకూలంగా స్థలాన్ని సిద్ధం చేయడంలో సర్పంచ్ అందించిన సహకారానికి YRS యూత్ సమత్ బట్టుపల్లి సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
వినాయక చవితి వేడుకలు, అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సర్పంచ్ అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం కొనసాగించాలని YRS యూత్ సభ్యులు కోరారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్
కరకగూడెం | Y7 న్యూస్ తెలుగు
Post Views: 41








