ఖమ్మం: లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మంలో విషాదం నింపింది.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ టేకులపల్లి కేఆర్ టవర్స్ 12వ బ్లాక్‌కు చెందిన చందా రమాదేవి అనే యువతి.. అదే కాలనీకి చెందిన ఇద్దరు యువకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ వారం రోజుల క్రితం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవి.. నేడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. వేధింపులకు సంబంధించిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.
Post Views: 101








