E-PAPER

మోదీ 25 ఏండ్ల ప్రజా పాలన లో దేశం సుభిక్షం – బీజేపీ

కూనవరం , (వై7 న్యూస్ తెలుగు) సెప్టెంబర్ 16: ప్రధాని నరేంద్ర మోడి జన్మదినం సందర్బంగా, దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.13సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రి 12సంవత్సరాలు ప్రధానమంత్రి గా ఏఒక్కరోజు సెలవు లేకుండా నిరంతరం, ప్రజా సేవకే పునరాంకితుడై, నిరంతర ప్రజా సేవకుడుకు వారి జన్మదినం రోజు వారికి ఆయురారోగ్యం ప్రసాదించాలని ప్రతి ఇంటికి వెళ్లి ఆశీర్వాద దీప కార్యక్రమం చేపట్టడం జరిగింది.

గ్రామాలలో, మన ఊరు -మన జెండా కార్యక్రమం, విద్యాలయాలలో 25ఏళ్ల పాలనలో చిత్ర లేఖనం, క్విజ్ పోటీలు నిర్వహణ కార్యక్రమాలు ప్రారంభించడం చేశారు. గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ లబ్ది దారులను కలిసి మోదీ 25 ఏళ్ల పాలన గురించి వివరించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్ లలో కేంద్ర ప్రభుత్వ ఉత్సవా కార్యక్రమాలు, ఆశా సేవకురాలు కలిసి వారిని ప్రోత్సహించారు, కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహించడం,12సంవత్సరాలనరేంద్రుని, దేశం రక్షణ, అంతరీక్ష, మౌలిక రంగాలు, విద్యా, వైద్యం, పారిశ్రామికం, రక్షణ, ఉపాధి రంగాలు,విదేశీ విధానం, వ్యవసాయ రంగంలో వృద్ధిరేటును , స్వదేశీ, వస్తువులు విదేశాలకు ఎగుమతి చేయటం, పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ ని ప్రపంచ అగ్రగామి దేశంగా ముందుకు తీసుకోవెళుతున్న నరేంద్రుని పాలన సేవ సంకల్ప ఉత్సవాలు నెలరోజులు పాటు, నిర్వహణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నోముల వెంకట రామారావు, పార్టీ శ్రేణులకు పిలుపు నివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాయం వెంకయ్య, మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, గ్రామాలలో శక్తి కమిటీలతో కలిసి, నరేంద్ర మోడి పాలన లో అభివృద్ధి, సంక్షే మం, ప్రజల లోకి తీసుకొని వెళ్ళాలి అని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం బిజెపి మండల అధ్యక్షులు కరక పవన్ అధ్యక్షతన జరిగింది, ఈ కార్యక్రమం ను బిజెపి జిల్లా కార్య దర్శి నోముల సత్య నారాయణ, తుర్ల పాటి కృష్ణర్జునరావు, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు, మండల కార్య దర్శి, పూసం భద్రయ్య, పూసం నరేష్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!