E-PAPER

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. దసరాకు థియేటర్లలో సందడి!

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ విడుదలైంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఘనంగా రిలీజ్ చేశారు.

అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) కలిసి స్వరపరిచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ క్యాచీ లిరిక్స్ అందించారు. ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ తన హై-వోల్టేజ్ వాయిస్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.

పాట తనకు ఎంతో నచ్చిందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!