శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రగతి భవన్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం) వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా త్రివర్ణ పతాకం ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం వందేమాతరం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో కొనసాగింది.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను మాజీ మంత్రి స్మరించుకున్నారు. వారి సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.









