
ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.
Post Views: 14









