భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పీవీఎన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం ఎస్ఐ పీవీఎన్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమరయోధుల సేవలను స్మరించుకోవాలని అన్నారు. వారి పోరాట ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
యువత విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారని, ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.









