భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన రిటైర్మెంట్ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆడే అవకాశం వచ్చినట్లు వెల్లడించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని తెలిపింది. క్రికెట్‌కు దూరమైనప్పటికీ ఆటతో తన అనుబంధం కొనసాగుతూనే ఉందని పేర్కొంది.
డబ్ల్యూపీఎల్‌లో ఆటగాడిగా కాకుండా ఓ ఫ్రాంచైజీకి మెంటర్ కమ్ అడ్వైజర్‌గా పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మిథాలీ చెప్పింది. యువ క్రీడాకారిణులకు తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా భారత మహిళా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడుతున్నానని పేర్కొంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో మహిళా క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలు చేపట్టడం కూడా తనకు ఆనందాన్ని కలిగించిందని మిథాలీ రాజ్ వెల్లడించింది. మహిళా క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.








