E-PAPER

నీళ్లు లేని బావిలో పడిన రెండు పాడి గేదెలు

అశ్వాపురం, జూన్ 18 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమెర్ధ గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లంవారి గుంపులో నీళ్లు లేని బావిలో పడిపోయిన రెండు పాడి గేదెలను గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సురక్షితంగా బయటకు తీశారు.గ్రామస్తుల వివరాల ప్రకారం, బుధవారం రాత్రి మేత కోసం వచ్చిన రెండు పాడి గేదెలు నీటి కోసం వెతుకుతూ ప్రమాదవశాత్తు నీళ్లు లేని బావిలో పడిపోయాయి. గురువారం ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది, పశువైద్య శాఖ మరియు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం గ్రామానికి చెందిన సీపీఐ జిల్లా నాయకులు అనంతనేని సురేష్ జేసీబీ సహాయంతో గేదెలకు తాళ్లు కట్టి ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోర్స కృష్ణ, ఉప సర్పంచ్ మేకల అంజిబాబు మాట్లాడుతూ సహకరించిన గ్రామ పెద్దలు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గేదెల యజమానులు ఇప్పటివరకు గుర్తించబడలేదని, వారు వచ్చే వరకు పంచాయతీ ఆధ్వర్యంలో గేదెలకు మేత, నీటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.అలాగే గ్రామంలో ఇలాంటి ప్రమాదకరమైన బావులు ఎక్కడైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని, వాటి చుట్టూ రక్షణ గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శేషగిరిరావు, వార్డు సభ్యుడు అర్జున్, అనంతనేని చంద్రశేఖర్, పశువైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News