కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య
భద్రాద్రి జిల్లా జూన్ 17
అశ్వాపురం మండల కేంద్రంలోని బుడుగు బజార్,గ్రామం లో నివాసం ఉంటున్న బైరోజు కాంతమ్మ–చంద్రయ్య దంపతుల,కు చెందిన, రేకులు ఇల్లు, కూలింది. సీతారాంపురం గ్రామంలో నివాసం ఉంటున్న నూప వెంకన్న ఇంటి, పై కప్పు రేకులు, గాలి దుమారాలకు లేచి కిందపడి పూర్తిగా ధ్వంసం అయ్యాయి, బుధవారం, కురిసిన,భారీ వర్షం, భయంకరమైన,గాలి వానలకు కారణంగా పూర్తిగా రేకులు ఇండ్లు కూలినాయి. ఇంటి, పై కప్పు రేకులు పూర్తిగా పగిలిపోయాయి. విపరీతంగా వీచిన ఈదురు గాలులకు, కురిసిన భారీ వర్షానికి, ముందస్తుగానే, కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు,పరుగులు తీయడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇండ్ల, పై కప్పు రేకులు పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబం నిరాశ్రయులై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంట్లోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు కూడా దెబ్బతిన్నట్లు, రెండు కుటుంబాల వారు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలియగానే గాలి దూమారం, వానలకు ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను, పరామర్శించి, వెంటనే పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య, చరవాణి ద్వారా సమాచారం తెలియపరచి ఇండ్లు కోల్పోయిన వారి కుటుంబాల యొక్క పరిస్థితులు, తెలియపరిచారు. చరవాణిలో విషయం తెలుసుకున్న వెంటనే, ఎమ్మెల్యే తక్షణ సహాయం కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని ఓరుగంటి బిక్షమయ్య, విలేకరులకు తెలిపారు, ఈ సందర్భంగా, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల వారికి తగిన ఆర్థిక సాహయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబ్క పిచ్చయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కందుల లక్ష్మణ్ అలిశెట్టి శ్రీను గ్రామస్తులు వార్డు సభ్యులు తదితరులు కుటుంబాలను పరామర్శించినారు.









