E-PAPER

పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న దువ్వాడ రవి

పలాస, జూన్ 13 (వై7 న్యూస్): పలాస మండలంలో వైఎస్సార్సీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షుడు దువ్వాడ రవి నిరంతరం కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

గత కొంతకాలంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు దువ్వాడ రవి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీకి మరింత ఆదరణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలాస మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దువ్వాడ రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు.

మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న దువ్వాడ రవి నాయకత్వం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News