E-PAPER

గ్లామర్ ప్రపంచంలో డ్రగ్స్ కలకలం: రూ.12 కోట్ల నిషేధిత నిల్వలతో దొరికిపోయిన మోడల్!

గ్లామర్ ప్రపంచంలో డ్రగ్స్ కలకలం మరోసారి సంచలనంగా మారింది. భారీ మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.12 కోట్ల విలువ చేసే నిషేధిత డ్రగ్స్‌ను రవాణా చేస్తూ మోడల్ హర్ష సన్నీ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. విమానాశ్రయంలో నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన అధికారులు, నిందితుడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా లభించిన భారీ డ్రగ్స్ నిల్వలను చూసి విస్తుపోయారు.

అయితే, అధికారుల తనిఖీల్లో డ్రగ్స్ దొరకగానే మోడల్ హర్ష సన్నీ వారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల కట్టుకథలు చెప్పడం ప్రారంభించారు. ఆ లగేజీ బ్యాగ్ తనది కాదని, విమానాశ్రయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి తనకు అర్జంట్‌గా అందించమంటూ సహాయం అడిగితేనే తీసుకువచ్చానని నమ్మించే ప్రయత్నం చేశారు. అందులో ఏముందో తనకు అస్సలు తెలియదని, తాను కేవలం ఒక కొరియర్ బాయ్‌లా మాత్రమే వ్యవహరించానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారుల ముందు డ్రామాలు ప్లే చేశారు.

కస్టమ్స్ అధికారులు ఆ కట్టుకథలను ఏమాత్రం నమ్మకుండా తమదైన శైలిలో విచారణను వేగవంతం చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్ రికార్డులను, గత కొద్దిరోజులుగా చేసిన ప్రయాణాల వివరాలను పరిశీలించగా, అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సన్నీకి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. మోడలింగ్ ముసుగులో ఈ తరహా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే అనుమానంతో హర్ష సన్నీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీని వెనుక ఉన్న మరికొందరు పెద్ద తలకాయల కోసం గాలిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News