వై 7 న్యూస్ పలాస:
రౌడీ షీటర్లు చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ సీఐ రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర ప్రవృత్తికి స్వస్తి పలికి మంచి జీవన శైలితో జీవనం సాగించాలని సూచించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని తెలిపారు.రౌడీ షీటర్లపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు.
Post Views: 8








