E-PAPER

ఉద్దానం అభివృద్ధికి కీలక అడుగు – నీలావతి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ శంకుస్థాపన

పలాస ;
ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్న ఈ కీలక సందర్భంలో పాల్గొనడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. పలాస మండలం నీలావతి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ (రైల్వే వంతెన) నిర్మాణానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తో కలిసి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటమైనది.ఈ సందర్భంగా…దశాబ్దాలుగా నీలావతి రైల్వే గేటు వద్ద వంతెన లేకపోవడంతో పలాస, మందస మండలాల్లోని సుమారు 50కి పైగా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్లు వెళ్లే ప్రతిసారి గేటు పడటంతో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, రైతులు మార్కెట్‌కు చేరుకోవడం వంటి దినసరి పనులు కూడా కష్టసాధ్యమయ్యాయి. ఈ సమస్యను కేంద్రమంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుని నిధులు మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం వంతెన నిర్మాణానికి పునాది వేయడం సంతోషకరమని, నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్దానం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News