పలాస: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పలాస బస్ డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన వారు, ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా, డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శాసనపూరి మురళి ఆర్థిక సహకారంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
రోజువారీగా పలాస బస్ డిపోకు వచ్చే వందలాది మంది ప్రయాణికులు, సిబ్బంది ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ ప్రోత్సహించబడతాయని అధికారులు తెలిపారు.
సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సహకరించిన మురళి ని పలువురు అభినందించారు.
Post Views: 8








