E-PAPER

గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

వై 7 న్యూస్ పలాస

స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ సామాజిక సేవకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీలో ఉన్న ఆయన విగ్రహానికి ఏపీటీపీ సి చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌతు లచ్చన్న చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News