కాశీబుగ్గ:
కాశీబుగ్గ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. భవాని గారు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎస్పీ గారికి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ భవాని గారికి శుభాకాంక్షలు తెలియజేసి, సబ్‌డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు సమర్థంగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
అదేవిధంగా నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.









