వై 7 న్యూస్ పలాస
పలాస పట్టణంలో ఉన్న Central Bank of India శాఖ వద్ద ATM సెంటర్ మూసివేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ATM సేవలు నిలిచిపోయినా, ఇప్పటివరకు పునఃప్రారంభం చేయకపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అందుబాటులో ఉన్న ATM సెంటర్ అకస్మాత్తుగా మూసివేయడంతో నగదు అవసరాల కోసం ఇతర బ్యాంకుల ATMలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఖాతాదారులు మండిపడుతున్నారు.
“ATM సౌకర్యం లేకపోయినా ఛార్జీలు మాత్రం వసూల్ చేయడం ఎంతవరకు సమంజసం?” అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంపై బ్యాంకు అధికారులను అడగగా, “సమీపంలో ATM సెంటర్ అందుబాటులో ఉంది, త్వరలోనే ఇక్కడ కూడా సేవలు పునఃప్రారంభిస్తాము” అని సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎప్పటికి ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వకపోవడంపై ఖాతాదారుల్లో అసంతృప్తి నెలకొంది.
పలాస పట్టణంలోనే ATM సెంటర్‌ను తక్షణమే పునఃప్రారంభించి, ఖాతాదారులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








