E-PAPER

కల్తీ బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామంలో కల్తీ బాదం పాలు తాగిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం జరిగిన కొండమ్మ తల్లి జాతరలో తక్కువ ధరకు విక్రయించిన బాదం పాలు తాగిన సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు.
బాదం పాలు తాగిన వారిలో జ్వరం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి బాదం పాలు విక్రయించిన క్లినిక్‌ను మూసివేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కల్తీ బాదం పాలు వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. జాతరల్లో ఆహార పదార్థాలపై పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News