వై 7 న్యూస్ పలాస
మంగళూరులో జరిగిన మహిళా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 69 కేజీల విభాగంలో 375 కేజీలు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించిన పలాసకు చెందిన సిద్వికను ఎమ్మెల్యే గౌతు శిరీష ఘనంగా సన్మానించారు.
శుక్రవారం టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను అభినందిస్తూ, మహిళలు క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పలాసకు పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పిరుకట్ల విఠల్ రావు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8








