భద్రాచలం;
గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన అనేక మందిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించి సేవా భావానికి ప్రతీకగా నిలిచిన గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ ఘనంగా సత్కరించారు.
రవీంద్రభారతిలో అందుకున్న “సాహస రత్న” పురస్కారం, తిరుపతిలో పొందిన “నేషనల్ అవార్డు” నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు ప్రసాద్ కుటుంబాన్ని సతీసమేతంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రాణాలను లెక్కచేయకుండా ఇతరులను కాపాడే వారు సమాజానికి నిజమైన హీరోలని కొనియాడారు. కరుకు ప్రసాద్ లాంటి వ్యక్తులు యువతకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.
కరుకు ప్రసాద్ చేసిన సేవలు భద్రాచలం ప్రాంతానికి గర్వకారణమని, ఇలాంటి ధైర్యవంతుల్ని గుర్తించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
Post Views: 161








