సమస్యలు ఎన్నున్నా, ఎప్పుడు మీ వెంటే.
ఆరో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి హరిత.
మెదక్ ఫిబ్రవరి 7
అభివృద్ధికి తోడవుదామని అధికార పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆరవాడ అభ్యర్థి హరిత అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రత్యర్థి పార్టీలు ప్రజలను మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలు చేస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని వార్డు ప్రజలను కోరారు. అభివృద్ధి ధ్యేయంగా వార్డు సమస్యలు బాగా తెలుసునని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికార పార్టీ అండదండలతో కౌన్సిలర్ బరిలో ఉన్నానని అధిష్టానం గుర్తించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. వార్డు సమస్యలు ఎన్ని ఉన్నా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే వార్డు తొందరగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ప్రజలను కోరారు.









