వై 7 న్యూస్ పలాస
నేటి నుంచి 7 రోజుల పాటు అంగరంగ వైభవం
శ్రీకాకుళం జిల్లా మందసలోని అతి పురాతన శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భక్తుల సందడితో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఏడు రోజుల పాటు స్వామివారి ఆలయంలో
తిరువీధి రథోత్సవం
విశేష అభిషేకాలు
హంసవాహనోత్సవం
ఇతర సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.
Post Views: 14









