వై 7 న్యూస్ పలాస | షార్ట్ న్యూస్
మందస మండలం హరిపురం వద్ద రైలు కింద పడి ఆర్మీ హవాల్దార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన జోగారావు (36) జమ్మూలో ఆర్మీ హవాల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post Views: 11








