మందస మండలం కేంద్రంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను డీఎస్పీ షేక్ షాహాబాద్ అహ్మద్ సోమవారం సాయంత్రం పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌లతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన డీఎస్పీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులతో మాట్లాడిన ఆయన, సమన్వయంతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
Post Views: 21








