E-PAPER

ప్రియురాలి అలకతో రైలు పట్టాలపై తల పెట్టిన యువకుడు… తప్పిన పెనుప్రమాదం

వై 7 న్యూస్ పలాస
టెక్కలి:
ప్రియురాలు అలకబూనిందన్న కారణంతో ఓ యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఆదివారం టెక్కలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌపడ నుంచి గుణుపూర్ వెళ్తున్న పాసింజర్ రైలు వద్ద యువకుడు పట్టాలపై పడగా అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతిని కలుసుకోవడానికి మెళియపుట్టి గ్రామానికి చెందిన యువకుడు టెక్కలికి వచ్చినట్లు సమాచారం. యువతిపై అబద్ధం చెప్పిందని అలకబూని ఈ అతి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించినట్లు టెక్కలి సీఐ విజయకుమార్ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News