వై 7 న్యూస్ పలాస
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలాస నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష కార్యాలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గౌతు శిరీష స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి మానవతా సేవకు నిదర్శనంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్ రావుతో పాటు పలాస పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని వేడుకలకు మరింత శోభనిచ్చారు.
Post Views: 42









