E-PAPER

పాడి రైతుల అభ్యున్నతికి అడుగు , పలాసలో పశు ఆరోగ్య శిబిరం .గౌతు శిరీష

వై 7 న్యూస్ పలాస

నేడు పలాస నియోజకవర్గం మందస మండలంలోని భిన్నళ మదనాపురం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు జిల్లా పశు సంవర్థక శాఖ సంయుక్తంగా నిర్వహించిన గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు లేగదూడల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస శాసన సభ్యులు గౌతు శిరీష హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ పాడి రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే పశు సంవర్థక శాఖ ద్వారా అమలవుతున్న పశు బీమా పథకం, మినీ గోకులం, పశుగ్రాసాల సాగు, సమీకృత దాణా పంపిణీ వంటి పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు.
పశువులను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు వాటి పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని, గర్భకోశ వ్యాధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, పోషకులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
పాడి పరిశ్రమ లాభసాటిగా సాగాలంటే లేగదూడల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
అనంతరం ప్రదర్శనకు తీసుకొచ్చిన దూడలను పరిశీలించి, ఉత్తమ దూడల పెంపకదారులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, పలాస అసిస్టెంట్ డైరెక్టర్ పి. చంద్రశేఖర్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ భావన దుర్యోధన, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతారావు, మందస మరియు హరిపురం పశువైద్యాధికారులు డాక్టర్ దువ్వాడ శ్రీకాంత్, డాక్టర్ కిల్లి ఉమాభారతి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సిబ్బంది డాక్టర్ రాధాకుమారి, డాక్టర్ కిరణ్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు రుద్రయ్య, భాస్కరరావు, కుప్పాయి గోపాల్, ముడుమంచి నవీన్, సాలిన మాధవరావు, ప్రధాన మన్మధరావు, ఇతర నాయకులు, పశు సంవర్థక శాఖ సిబ్బంది, పాడి రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News