E-PAPER

మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ ధ్యేయం — పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

వై7 న్యూస్ | పలాస
కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతోందని పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి స్థాపించిన రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సేర్ఫ్) ద్వారా పేదలకు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా అందిస్తున్నామని తెలిపారు.
గురువారం పలాస నియోజకవర్గం మందస మండలం కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం పైడి కూర్మారావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ సిఆర్పిల శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పంచసూత్రాలు పాటిస్తున్న పొదుపు సంఘాలకు ఆదాయాభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన రుణాలను బ్యాంకులతో పాటు ప్రభుత్వ శ్రీనిధి బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే అందిస్తున్నామని తెలిపారు.
ఎలాంటి డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రూ.8 లక్షల వరకు కేవలం 92 పైసల వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు, యూనిట్లు స్థాపించిన మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
అన్ని గ్రామ సంఘాల్లో ప్రతి పది సంఘాలకు ఒక ‘ఈ-నారీ’, అలాగే 25 సంఘాలు దాటిన గ్రామ సంఘాల్లో ఇద్దరు సిఆర్పిలకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సమైక్య ప్రతినిధులు, వెలుగు సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షులు భావన దుర్యోధన, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతారావు, పీఏసీఎస్ అధ్యక్షులు భాస్కరరావు రుద్రయ్య, వడిముంజి నవీన్, డొంకురు తిరుపతి, రాజాన మహేష్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News