E-PAPER

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అర్పించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస:
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పలాస మండలం బ్రాహ్మణతర్ల ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొని, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితుడై భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించిన ధీరోదాత్తుడు ఆయనని గుర్తు చేశారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని, ఈ త్యాగాన్ని నేటి తరాలు స్మరించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని అమరజీవికి నివాళులు అర్పించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News