సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగలేదని ఆరోపణ
ఎక్స్ సర్పంచ్ చందు నాయక్
బూర్గంపాడు:
ఈ నెల 11వ తేదీన నిర్వహించిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని మాజీ సర్పంచ్ చందు నాయక్ ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరుల సమావేశంలోవెల్లడించారు.
ఎన్నికల సమయంలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్న చందు నాయక్, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.గ్రామంలోని ప్రజలందరికీ తాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు.గ్రామంలో ఏర్పడే సమస్యలపై ముందుగా గ్రామపంచాయతీని సంప్రదించాలని, అక్కడ పరిష్కారం లభించకపోతే తనకు సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చందు నాయక్ పేర్కొన్నారు.
రిపోర్టర్ ; మేకల జ్యోతి
Post Views: 146









