E-PAPER

ప్రజల నమ్మకమే మా శక్తి… గుండాల మండలంలో కాంగ్రెస్ విజయం ఖాయం

– పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల
జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గుండాల మండల వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత ప్రచార కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల ఘన విజయం లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
“కాంగ్రెస్ పార్టీ మాటలకే పరిమితం అయ్యే పార్టీ కాదు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ కలిగిన పార్టీ. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుంది” అని స్పష్టం చేశారు.

గ్రామాల్లో తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, పేదల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పాలన సాగుతుందని తెలిపారు. రైతులకు పూర్తి మద్దతు, మహిళలకు భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా గ్రామస్థాయి పాలన కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే బాధ్యతాయుతమైన పాలన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు:

కాచనపల్లి – బోడ వెంకట్రామ్

శెట్టిపల్లి – డిల్లీ వసంతరావు

శంభునిగూడెం – ఈసం సుమలత

లింగగూడెం – కుంజ కృష్ణ

రోల్లగడ్డ – దుగ్గి జ్యోతి

గుండాల – వాంకుడోత్ బికోజి

పై అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే గుండాల మండలంలో సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం అంటే అభివృద్ధిని గెలిపించడమేనని, ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను భుజాన వేసుకుని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల విశ్వాసం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ కార్యక్రమంలో PSR–PVR యువసేన కోఆర్డినేటర్ ఎస్.కె. ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!