పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు
లక్ష్మిదేవిపల్లి ;
కొత్తగూడెం నియోజకవర్గం, లక్ష్మిదేవిపల్లి మండలం పరిధిలోని సాటివారిగూడెం, చాతకొండ, హమాలీ కాలనీ, లక్ష్మిదేవిపల్లి, లోతువాగు, సంజయ్ నగర్, ప్రశాంతి నగర్ గ్రామాల్లో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దేవీప్రసన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు చిన్ని, తూము చౌదరి, జనార్దన్ రెడ్డి, జేవీఎస్ చౌదరి, జగన్, పూనెం శ్రీను, గౌస్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ ;మేకల జ్యోతి









