E-PAPER

లింగారెడ్డి పేట్ హత్య కేసు ఛేదించిన తూప్రాన్ పోలీసులు

మెదక్ తూప్రాన్ డిసెంబర్ 10:-

గుర్తు తెలియని వ్యక్తిని చేతులు కట్టేసి దారుణ హత్యకు గురయిన కేసును తూప్రాన్ పోలీసులు చేధించారు.సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం..తూప్రాన్ మండల పరిధిలోని లింగారెడ్డిపేట్ బస్ స్టాండ్ టోల్ ప్లాజా తదితర ప్రాంతాల్లో చెత్త కాగితాలు వేరుకుంటూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన ర్యాపని హనుమంతు తండ్రి మాదయ్య (40) వడ్డెర కాలనీ చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా కొంతకాలంగా రోడ్ల ప్రక్కన బస్ స్టాప్ల దగ్గర చెత్త సేకరించి బ్రతుకుతున్నారు.రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఇతనితో పాటు చెత్త సేకరించి తన ప్రక్కనే పడుకునే వాడని అన్నారు.తను సేకరించిన కాగితాలను దొంగతంగా అమ్ముకోవడం సేకరించడం ఇవ్వని నచ్చక పోవడంతో ఎలా అయినా చంపి అడ్డు తొలగించాలని అనుకున్నాడు.మంగళవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయిన సదరు వ్యక్తిని తన దగ్గర ఉన్న తాళ్లతో కళ్లు చేతులు కట్టేసి తలకు బలంగా కొట్టిన చావకపోవడంతో తాడుతో మెడకు చుట్టి హత్య చేశాడు.తరువాత గుర్తు పట్టకుండా ఉండటానికి కట్టెలతో తగలపెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అనిల్,ఉమేష్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ మంటలు గమనించి తూప్రాన్ సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివానందంకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు.అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ రంగకృష్ణ ఎస్ఐ శివానందం తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!