హైదరాబాద్ డిసెంబర్ 10
ఈ నెల డిసెంబర్ 11, 14 17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారంగా సెలవులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, ఎన్నికల రోజున జె.న్టీ.యూ.హెచ్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ లో పరిధిలో జరుగుతున్న పరీక్షలు వాయిదా వేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిదంగా యూనివర్సిటీలలో పరీక్షల తేదీలను పోస్ట్ ఫోన్ చేసే విదంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులను కోరారు.
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువత, ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఓటు వేయడంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఎన్నికల రోజున పరీక్షలు పెడితే ఎలా ఓటు వేస్తారని, ఒకసారి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత విద్య శాఖ అధికారులు ఆలోచన చేయాలని అన్నారు.
డిసెంబర్ 11,14,17 తేదీలలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి రిజియాన్ లో పాలు ఉన్నత విద్య సంస్థలు ఉండటం వల్ల ఈ విద్య సంస్థల్లో గ్రామీణ ప్రాంతాలోని యువత విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న వాళ్లు ఓటు వేసే అవసరం ఉంటుంది కాబట్టి వారికీ సెలవు దినాలను ప్రకటించాలని కోరారు.









