-చోరీ చేసిన వస్తువులను స్వాధీనం
-సీఐ రంగకృష్ణ వెల్లడి
తూప్రాన్ నవంబర్.28
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని నర్సాపూర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహనాలు చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి పోలీస్ పార్టీని చూసి బయపడి పారిపోతుండగా అతడిని వెంబడించి పట్టుకొని విచారించినట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన కట్ట నవీన్(26) తండ్రి బిక్షపతి చింతకుంట పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని ప్రస్తుతం హైదరాబాద్ లోని చింతల్ గణేష్ నగర్ లో నివాసం ఉంటున్నాడని తెలిపారు.ఐతే ఈ నెల 25.11.2025 నాడు రాత్రి నవీన్ తూప్రాన్ పట్టణం లోని ఒక బిల్డింగ్ లో దొంగతనం చేసానని,దొంగతనం చేసిన సొత్తును నర్సాపూర్ లో అమ్ముకుందామని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని విచారణలో వెల్లడైందని తెలిపారు.నవీన్ దగ్గర ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు 37 తులాలవెండి ఆభరణాలు, రెండు గడియారాల తోపాటు 2,20,000రు.ల నగదు ఉన్నాయని తెలిపారు.వాటిని పంచుల సమక్షం లో స్వాదీన పర్చుకొని నవీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినట్లు సీఐ రంగ కృష్ణ తెలిపినారు.









