మంగపేట (ములుగు జిల్లా):
సేవా భావనతో ముందుకు సాగుతున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవనీయులు అందే శ్రీ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. మంగపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ,
సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అందే శ్రీ మనందరికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా మాత్రమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సేవకులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొని ఆయన సేవలను స్మరించారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
#జ్వాలాచారిటబుల్ట్రస్ట్ #ములుగుజిల్లా #మంగపేట #అందేశ్రీ #సేవామార్గం #Y7NewsTelugu
Post Views: 201









